TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే : మంత్రి కోమటిరెడ్డి

Published on: Sat Aug 30, 2025 4:14PM

 

మాజీ సీఎం కేసీఆర్ రేపు అసెంబ్లీకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వద్ద మీడియాతో చిట్ చాట్‌ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలిని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కేసిఆర్ హయాంలోనే రికార్డు స్థాయిలో కట్టారు..ఆయన హయంలోనే కూలిందన్నారు. కాళేశ్వరంపై వేసిన కమిషన్ జడ్జి..సుప్రీం కోర్టు జడ్జిగా పనిచేశారు..మంచి పేరున్న న్యాయ మూర్తి ఆయన అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. 

కమిషన్ కమిటీ సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని దానికి భయపడే కేసీఆర్, హరీష్ రావు కోర్టుకు పోయారని మంత్రి తెలిపారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే.. కేసీఆర్ అసెంబ్లీ వచ్చి చెప్పాలి. ప్రతిపక్ష నేతగా జీత భత్యాలు తీసుకుంటున్నాడు..బాధ్యత ఆయనపై ఉంటదని  వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం పై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్ వాకౌంట్ చేయకుండా.. మా మీద పూలు చల్లుతారా.? తప్పించుకుని పారిపోతారు.

కాళేశ్వరం పూర్తి నివేదిక, కంప్లీట్ గా చర్చ ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుతున్న..కేసీఆర్ శాసన సభకి రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లే అని ఆయన తెలిపారు. కాళేశ్వరం పై లక్ష కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా.?ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని స్పష్టం చేశారు...వాళ్లను ఏం చేయాలో ప్రజలు నిర్ణయిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు