TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ పొడిగింపు

Published on: Tue May 27, 2025 6:18PM

 

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ కూటమి ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబర్ వరుకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్ జీవో ఆర్టీ నంబర్ 1028ను జారీ చేశారు. ప్రభుత్వ సొమ్మును ఖర్చుచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సంజయ్‌ సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సర్వీసులలో డీజీగా ఉన్నప్పుడు నిధులను దుర్వినియోగం చేసినందుకు సస్పెన్షన్‌ను పొడిగించారు. 

ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ పేరిట నిధులు దుర్వినియోగం అయినట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం మరోసారి పేర్కొంది. సంజయ్ సస్పెన్షన్‌ను మరో 180 రోజులు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. అగ్నిమాపక డీజీగా ఉన్న సమయంలో అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని రూ. కోటి దుర్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చింది. సీఎం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఈయన వరుస మీడియా సమావేశలు నిర్వహించారు.