ఎమ్మెల్యే హత్య కేసులో మాజీ ఎంపీకి జైలు శిక్ష


 


 ఓ ఎమ్మెల్యే హత్య కేసులో ఓ ఎంపీకి జైలు శిక్ష పడింది. ఈ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జనతాదళ్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రభునాథ్ సింగ్‌..23 ఏళ్ల కిందట ఎమ్మెల్యే అశోక్ కమార్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో భాగంగా ఇన్ని సంవత్సరాలకు గాను జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీభాగ్ కోర్టు జైలు శిక్ష విధించింది.

 

కాగా నార్త్ బీహార్ మార్సాఖ నియోజక వర్గానికి చెందిన శాసనసభ్యుడు అశోక్ కుమార్ సింగ్‌ని ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలో అతని అధికారిక నివాసంలోనే జులై 3, 1995 సంవత్సరంలో దుండగులు బాంబులు వేసి హత్య చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు మరో వ్యక్తి అనిల్ కుమార్ సింగ్ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే అశోక్‌కుమార్ సింగ్ భార్య చాందినీ దేవీ ఫిర్యాదు చేశారు. తన భర్తను ఎంపీ, అతడి సోదరుడు చంపారని చాందినీ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ హత్య కుట్రలో ప్రభునాథ్‌సింగ్ పాత్ర ఉన్నట్లు తేల్చారు. ఈ కేసులో మాజీ ఎంపీతో పాటు ఎంపీ సోదరుడు ధనానాథ్‌సింగ్‌తో పాటు మరో వ్యక్తి రితేశ్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.