Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ మంత్రి కాకాణి అరెస్టు
posted on: May 25, 2025 10:54PM
.webp)
రెండు నెలలుగా పోలీసులను ముప్పతిప్పలు పట్టిన వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు పోలీసులకు దొరికారు. పోలీసులు ఆదివారం( మే 25) ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేరళలో తలదాచుకున్న కాకాణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకాణిని సోమవారం (మే26) ఉదయానికి నెల్లూరుకు తీసుకురానున్నారు. కాగా, ఇటీవల సుప్రీంకోర్టు కూడా కాకాణి ముందస్తు బెయిల్‌ని తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్న అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా గాలించారు. ఎట్టకేలకు కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమ మైనింగ్ కేసులో కాకిణి గోవర్ధన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఆయనకు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు. కానీ.. కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొన్ని కేసుల్లోనూ ఆయనకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయినప్పటికీ కాకాణి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులన్నింటి నుంచి రక్షణ పొందేందుకు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారాయన. కానీ.. ఆయన ప్రయత్నాలన్నీవిఫలమయ్యాయి.
మరోవైపు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణి జాడ కనిపెట్టేందుకు పోలీసులు చాలా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే.. కాకాణి కేరళలో ఉన్నట్లు సమాచారం అందుకున్నారు. వెంటనే ఆయన ఉన్న ప్లేస్‌కి వెళ్లిన పోలీసులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.


.webp)



