TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పెద్దిరెడ్డికి బిగుస్తున్న భూముల ఉచ్చు!

Published on: Thu May 15, 2025 12:52PM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో తన హవా చాటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి,  సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలను శాసించేవారు. ఆయనకు కావాల్సిన వారికి పదవులు.. కన్నెర్ర చేసిన వారికి కష్టాలు తప్పదని సొంత కొటరీ నాయకులు చెబుతుంటారు. ఇలా సాగిన ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్ల పై భూములు కనిపిస్తే కబ్జా చేస్తూ పోయారు. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై సామగ్ర విచారణలో లోతైన విషయాలు బయటపడ్డాయి.

పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు సమీపంలోని అటవీ భూముల పై విచారణ ఇప్పటికే జరు గుతోంది.. మరో వైపు తిరుపతిలోని బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకుని కంచెను వేసుకుని ఆనుభువిస్తున్న దానిపై ఇటీవల దేవాదాయశాఖ, మఠం అధికారులు నోటీసులు పంపి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి అటవీ భూములు ఆనుకుని ఉన్న భూమికి మరింత స్వాధీనం చేసుకుని కూలీల కోసం విలాసవంతమైన భవనం చిత్తూరు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగంపేట లో నిర్మించారు. వీటితోపాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి పై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నది.

మంగళంపేటలోని 27.98 ఎకరాల అటవీశాఖ భూమిని ఆక్రమించడంతో పాటు జీవవైవిధ్యంకు నష్టం కలిగించారని ప్రాథమిక నివేదికలో     అధికారులు పేర్కొన్నారు. దీనిలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ,   మరో ఇద్దరు సహా  మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయ్యింది త్వరలో పాకాల కోర్టు లో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు అనే దాని పై విచారణ జరుగుతోంది.