TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డబ్బు కోసమే అలా చేశా...

Published on: Sat Feb 7, 2015 12:43PM

 

అమెరికాలోని ఓరెగాన్ స్టేట్ యూనివర్సిటీ లైబ్రరీలో ఆమధ్య ఓ అందగత్తె ఒక సాహసం చేసి పోలీసులకు దొరికిపోయింది. కేండ్రా సండెర్లాండ్ అనే పేరున్న, దాంతోపాటు మంచి పర్సనాలిటీ కూడా వున్న ఈ అందగత్తె కొద్ది రోజుల క్రితం ఆ లైబ్రరీలో ఓ మూల సైటిలై, సెల్‌ఫోన్ వీడియో కెమెరా ఆన్ చేసింది. ఆ తర్వాత తన బట్టలు తొలగించి, పదిహేడు నిమిషాల నిడివి వున్న వీడియోను రికార్డు చేసింది. ఈ వీడియో ఆ తర్వాత ఇంటర్నెట్‌లో విడుదలైంది. 19 ఏళ్ళ వయసున్న కేండ్రా ఆ యూనివర్సిటీ మాజీ విద్యార్థిని. ఈ వీడియో చూసి బిత్తరపోయిన యూనివర్సిటీ యాజమాన్యం కేండ్రా మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా యూనివర్సిటీ లైబ్రరీలో ఇలాంటి వీడియో రికార్డు చేయడం ఘోరమంటూ ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేండ్రా మీద కేసు నమోదు చేశారు. ఈ వీడియో పుణ్యమా అని మొన్నటి వరకూ అనామకురాలిగా వున్న కేండ్రా పేరు ఇప్పుడు అమెరికా మొత్తం మార్మోగుతోంది. ఆమె ఫొటోలు, వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె తల్లిదండ్రులు మాత్రం మా అమ్మాయి పరిస్థితి ఇలా అంగట్లో సరుకు మాదిరిగా అయిపోయిందేంటా అని బాధపడుతున్నాయి. కానీ కేండ్రా మాత్రం జరిగన పరిణామాలన్నీ తనకు సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెబుతోంది. తాను డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఆ వీడియో తయారు చేశానని, దాన్ని ఒక అమెరికాలోని ఒక ప్రముఖ వెబ్‌సైట్‌కి అమ్మి సొమ్ము చేసుకున్నానని ధైర్యంగా చెబుతోంది. ఇంత పెద్దదాన్నయ్యాను.. నా ఖర్చులకోసం ఇంకా నా తల్లిదండ్రుల మీద ఆధారపడటం న్యాయం కాదు కదా అని కూడా అంటోంది. ఇప్పుడు కేండ్రా వీడియో తెచ్చిన పబ్లిసిటీ పుణ్యమా అని ఆమెకు మార్కెట్లో బాగా డిమాండ్ పెరిగింది. ఆమెతో ‘అలాంటి’ పొటో షూట్లు చేయడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. కొన్ని సంస్థలతో కేండ్రా ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.