TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందులలో కాల్పుల కలకలం

Published on: Tue Mar 28, 2023 3:25PM

సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది.  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  నిందితుడిగా  ఉన్న సునీల్  యాదవ్ కు  భరత్ యాదవ్  బంధువు.  

ఆ కేసులో భరత్ కుమార్ యాదవ్ ను కూడా పోలీసులు గతంలో విచారించారు.  భరత్‌ కుమార్‌ యాదవ్‌  వ్యక్తి ఇద్దరు వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపి తీవ్రంగా గాయపరిచాడు.  

డబ్బులకు సంబంధించిన గొడవే ఇందుకు కారణంగా చెబుతున్నారు.  దిలీప్ , భరత్ కుమార్ యాదవ్ మధ్య  డబ్బుల విషయమై  జరిగిన గొడవే ఈ కాల్పులకు కారణమని చెబుతున్నారు.