Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికాలో ఇండియన్ కాల్చివేత
posted on: May 21, 2015 2:39PM

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సెయింట్ అగస్టీన్‌లో ఓ నిత్యావసర వస్తువుల దుకాణంలో క్లర్క్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ యువకుడు దుండగుల దాడిలో ప్రాణాలు వదిలాడు. ఆ యువకుడు పనిచేసే దుఖాణంలోకి ఇద్దరు టీనేజ్ యువకులు ముఖాలకు గుడ్డలు కట్టుకుని ప్రవేశించారు. దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ యువకులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మానవ్ దేశీ అనే భారతీయ యువకుడి మీద దాడి చేశారు. ఈ దాడిలో ఆ భారతీయ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. గతంలో ఉత్తర కరోలినా ప్రాంతంలో నివసించిన మానవ్ దేశీ రెండు నెలల క్రితమే ఫ్లోరిడాకు వచ్చాడు. త్వరలో మానవ్ వివాహం జరగనున్నట్టు తెలిసింది. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు.






