TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల

Published on: Thu Aug 28, 2025 9:52AM

ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

12 గేట్లను పది అడుగుల మేర, 14 గేట్లను ఐదడుగుల మేర ఎత్తి 2లక్షల 94 వేల 74 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం ఇన్ ఫ్లో6 2 లక్షల 986 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 3 లక్షల 45 వేల 14 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం నీటి మట్టం 590 అడుగులకు చేరుకుంది.