TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హమ్మయ్య కృష్ణమ్మకు వరద నీరొస్తోంది.!

Published on: Tue Jul 28, 2026 12:01PM

 తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనూ  కృష్ణానదికి వరద నీరు వస్తోంది. రైతులకు ఊరట కలిగంచేలా జూరాలకు వరద ఉధృతి పెరిగింది. ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు వరుణుడు ముఖం చాటేసినా..  కృష్ణా నది ఎగువ  ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా   జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది.

 జూరాల ప్రాజెక్టుకు  32వేల  క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.  దీంతో అధికారులు  క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి సుమారు 30 వేల 700 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం జలాశయం వైపు   పంపిస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు వదులుతుండటంతో కృష్ణానది తీరం వెంబడి వరద నీరు ఉరకలెత్తుతోంది. 

 మహారాష్ట్ర, కర్ణాటకలో రానున్న నాలుగైదు రోజుల పాటు   భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సమాచారంతో  జూరాలకు వచ్చే ఇన్‌ఫ్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. అదే జరిగితే.. రాబోయే నాలుగైదు రోజుల్లో శ్రీశైలం జలాశయం కూడా జaకళను సంతరించుకుంటుందని అంటున్నారు.  

Jurala project flood, Srisailam dam water level, Krishna river inflows, Jurala dam gates opened, Telugu news