ఏపీకి గుడ్ న్యూస్
Published on: Tue Jun 26, 2018 3:36PM

'అధికారం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా' ఈ మాట చంద్రబాబుకి కరెక్ట్ గా సరిపోతుందేమో.. విభజన తరువాత ఏపీ పరిస్థితి చూసి అందరూ చాలా భయపడ్డారు.. రాజధాని లేదు, లోటు బడ్జెట్.. అసలు ఏపీ అభివృద్ధి చెందుతుందా అనుకున్నారు.. కానీ ఎక్కడో నమ్మకం.. చంద్రబాబు తన అనుభవం, తెలివితేటలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని.. ఇప్పుడు ఆ నమ్మకమే నిజం అవుతుంది.. గొప్ప రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.. అనేక విద్యాసంస్థలు, కంపెనీలు తీస్కోచ్చారు.. ఇప్పుడు మరో పెద్ద కంపెనీ ఏపీకి రాబోతుంది.. పెట్టుబడులు పెట్టేందుకు తమ రాష్ట్రం ఇస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సర్విసెస్ సంస్థ ‘ఫ్లెక్స్ట్రానిక్స్’ను కోరారు.. అయితే ఇప్పుడు ఏడాది తర్వాత రాష్ట్రానికి ఆ కంపెనీ రావడానికి రంగం సిద్దం చేసుకుంది..
ఈ కంపెనీ ఏర్పాటుకు తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు కూడా పోటీపడ్డాయి.. కానీ ఈ కంపెనీ ఏపీకి రావడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది.. రాష్ట్రంలో 585 కోట్ల రూపాయలతో 6600 మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా ఈ కంపెనీ ప్రతిపాదించింది.. ఈ కంపెనీ ప్రతినిధులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనుంది.. అయితే ఈ కంపెనీ రాకలో మంత్రి లోకేష్ కృషి కూడా ఉన్నట్టు తెలుస్తుంది.. 'రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితుల గురించి వివరించి, నిత్యం ఒక బృందం ఆ సంస్థ ప్రతినిధులతో అందుబాటులో ఉంచి, వారికి అవసరమైన సమాచారాన్ని వేగంగా అందించేలా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది.. మొత్తానికి ఒక పెద్ద కంపెనీ రూపంలో ఏపీకి గుడ్ న్యూస్ వచ్చిందన్నమాట.


