TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భయమన్నదే లేని యోధుడి కుమార్తె!.. టాక్ ఆఫ్ ది స్టేట్ గా కవిత నివాసం ముందు ఫ్లెక్సీలు

Published on: Mon Jun 2, 2025 2:22PM

ఎవరు ఔనన్నా కాదన్నా.. ఎవరు ఒప్పకున్నా.. ఒప్పుకోకున్నా.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మొత్తం కల్వకుంట్ల కవిత చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్ అధినేత కుమార్తెగా కాకుండా.. ఆమె పార్టీకి భిన్నంగా సొంత శైలిలో ముందుకు కదులుతున్న తీరు చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం పరిభ్రమిస్తోంది. తలలు పండిన రాజకీయ విశ్లేషకులు సైతం.. కవితకు ఇంతటి ప్రాధాన్యత ఎలా వచ్చిందని విస్మయం చెందుతున్నారంటే అతిశయోక్తి లేదు. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ లీకైన క్షణం నుంచీ  మీడియా మొత్తం కవిత చుట్టూనే తిరుగుతోందనడంలో  ఆశ్చర్యంలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సమయంలో కూడా కవితకు అత్యంత ప్రాధాన్యత లభిస్తున్నది.

తాజాగా బంజారాహిల్స్ లోని ఆమె నివాసం ఎదుట వెలిసిన ఫ్లెక్సీలు ఇప్పడుు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. యోధుడి కుమార్తెకు భయమన్నదే లేదు అన్న క్యాప్షన్ తో  ఉన్న ఫ్లెక్సీ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫ్లెక్సీ చుట్టూ గులాబి జెండాలు ఉన్నప్పటికీ వాటిలో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావనే లేదు.  ఇక ఆ ఫ్లెక్సీలలో కవిత  తెలంగాణ  బొగ్గుగని కార్మికుల కమిటీ కండువా ధరించి ఉన్న ఫొటో ఉంది. ఇప్పుడీ ఫ్లెక్సీల చుట్టూనే చర్చ నడుస్తోంది. కవిత రాజకీయ అడుగులు ఎటు అన్న చర్చ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, కేసీఆర్ కాళేశ్వరం విచారణకు హాజరు వంటి అంశాలను కూడా మరుగున పరిచేసిందని పరిశీలకులు అంటున్నారు.