TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెండో భార్య కోసం బ్యాన‌ర్లు.. ఎందుకో తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..

Published on: Mon Jan 31, 2022 11:37AM

వ‌ధువు కావ‌లెను. ఇది కామ‌న్ యాడ్‌. మీ ఓటు నాకే వేయండి. ఇది కూడా రొటీన్ డైలాగ్‌. కానీ, నాకు రెండో భార్య కావ‌లెను.. అదికూడా ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు.. అంటూ పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం మాత్రం ఇంట్రెస్టింగ్ మేట‌ర్‌. అవును, అత‌ను మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకున్నాడు. కానీ, అత‌నికి ముగ్గురు పిల్ల‌లు ఉండ‌టంతో పోటీకి అనర్హుడు. మ‌రి, ఎలాగైనా బ‌రిలో దిగాల‌ని గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఆ ఆశావ‌హుడు. ఓ బంప‌ర్ ఐడియా వ‌చ్చింది. తాను రెండో పెళ్లి చేసుకొని.. త‌న భార్య‌ను ఎన్నిక‌ల బ‌రిలో నిల‌పాల‌ని భావించాడు. ఈ ఐడియా త‌న జీవితాన్నేమార్చేస్తుంద‌ని అనుకున్నాడు. ఇక వెంట‌నే రంగంలోకి దిగిపోయాడు. 
  
ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు రెండో భార్య కావాలంటూ నగరం మొత్తం బ్యానర్లు ఏర్పాటు చేశాడు రమేశ్‌ పాటిల్‌. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో కూడా స్ప‌ష్టంగా తెలిపాడు. పెళ్లి కాకున్నా ఓకే.. ఒక‌వేళ ఇప్ప‌టికే పెళ్లి అయి ఉంటే మాత్రం ఆమెకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలనే షరతు పెట్టాడు. ఆస‌క్తి ఉన్న వారు త‌న‌ను సంప్ర‌దించాలంటూ.. తన ఫోన్ నెంబర్‌ను బ్యానర్లలో వేశాడు. న‌గ‌రమంతా ఆ బ్యాన‌ర్లు ఇప్పుడో హాట్ టాపిక్‌. వీడి పైత్యం పాడుగానూ.. అంటూ జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. భార్య దొరికుతుందో లేదో కానీ.. ర‌మేశ్ పాటిల్ మాత్రం ఓవ‌ర్‌నైట్ ఔరంగాబాద్‌లో ఫుల్ ప‌బ్లిసిటీ సంపాదించేశాడు.