Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కామారెడ్డిలో ఐదుగురు చిన్నారులు మిస్సింగ్
posted on: Mar 7, 2026 8:48PM

కామారెడ్డిలో రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారులు మిస్సింగ్ కలకలం రేపుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో 10 ఏళ్ల లోపు పిల్లలు నిన్న ఇద్దరు, ఈరోజు మరో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. ఐదుగురు పిల్లలు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాధిత కుటుంబాలు కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
నిన్న పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన పదేళ్ల సింహాద్రి, తొమ్మిదేళ్ల విజయ్ కనిపించకుండా పోయారు. ఈరోజు ఆర్బీ నగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు సీపాత్ (8), ఆయాత్ (7), మరియం (5) అదృశ్యమయ్యారు. ఈ ముగ్గురు పిల్లలు తండ్రితో కలిసి ఆటోలో దుకాణానికి వెళ్లారు. తండ్రి వారిని షాపు వద్ద దింపి కిరాయికి వెళ్లగా, ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బస్టాండ్ పరిసర ప్రాంతాలు, రహదారుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు


.webp)



