ట్రాన్స్‌ జెండర్‌ కు రాహుల్ కీలక పదవి

 

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ ట్రాన్స్‌ జెండర్‌ కు పార్టీలో కీలక పదవిని అప్పగించారు. తమిళనాడుకు చెందిన, తెలుగు మూలాలు ఉన్న అప్సరా రెడ్డి అనే ట్రాన్స్ జెండర్‌ ను ఆలిండియా మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ పదవి చేపట్టిన మొదటి  ట్రాన్స్‌ జెండర్‌ గా రికార్డు సృష్టించింది. ఉన్నత విద్యావంతురాలైన ఆమె లండన్ సిటీ వర్సిటీలో చదువుకుంది. బీబీసీ వరల్డ్ సర్వీస్, ద హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, దక్కన్ క్రానికల్ తదితర మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేసింది. 133 ఏండ్ల చరిత్ర గల ఈ పార్టీ జాతీయస్థాయిలో ఒక ట్రాన్స్‌ జెండర్‌ ను నియమించడం ఇదే మొదటిసారి. గతంలో అప్సరా అన్నాడీఎంకేలో, బీజేపీలో కూడా పనిచేసింది. దీనిపై అప్సరారెడ్డి మాట్లాడుతూ...అన్ని వర్గాల వారిని కలుసుకుంటూ.. మహిళల అభ్యన్నతి కోసం, వారి హక్కుల సాధనకు కృషి చేస్తానన్నారు . మహిళలకు ఆర్థిక సాధికారత సాధించడం కోసం వివిధ రాష్ట్రాల్లోని మహిళా కాంగ్రెస్ శాఖల అధ్యక్షురాళ్లతో కలిసి పని చేస్తానని తెలిపారు. తనకి అత్యున్నత స్థానం కల్పించినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.