క‌రోనా నుంచి త‌ప్పించుకునే ట‌న్నెల్‌!

కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌లు ర‌ద్దీగా తిరిగే ప్ర‌దేశాల్లో ప్ర‌త్యేక ట‌న్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మ‌నం ఇక్క‌డ చూస్తున్న ట‌న్నెల్ తిరుపూర్ మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.

త‌మిళ‌నాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లాకు చెందిన డి.వెంక‌టేష్ వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ న‌డుపుతూ వుంటాడు. అయితే స్థానిక జిల్లా యాంత్రాంగం స‌హ‌కారంతో కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి 16 ఫీట్‌ల ట‌న్నెల్ రూపొందించాడు. ఈ ట‌న్నెల్ లోప‌ల‌కు ప్ర‌వేశించ‌డానికి ముందు చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలి. ఈ ట‌న్నెల్ ను మార్కెట్ బ‌య‌ట ఏర్పాటు చేశారు. మార్కెట్‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ ట‌న్నెల్ ద్వారానే వెళ్ళాల్సి వుంటుంది. ముందుగా చేతులు క‌డుక్కొని ఈ ట‌న్నెల్ ప్ర‌వేశించి ఐదు సెకెండ్లు న‌డ‌క కొన‌సాగిస్తున్నారు. నీటితో క‌లిపిన సోడియం హైపో క్లోరైడ్ ద్రావ‌ణాన్ని స్ప్రే చేస్తున్నారు. ఇలా మ‌నుషుల్ని శుభ్రం చేస్తున్నారు.

ఒకసారి ఒక వ్యక్తి ఇందులోకి వెళ్లి న‌డ‌క కొన‌సాగితే విద్యుత్‌ ఆధారంగా నడిచే పంపు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. మార్కెట్ ఏరియాలో ప్ర స్తుతం దీన్ని వినియోగిస్తున్నారు. భ‌విష్య‌త్‌లో వాహ‌నాలు కూడా ఇందులోంచి వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కార్తికేయ‌న్ తెలిపారు.

ఈ 16 ఫీట్‌ల ట‌న్నెల్ ఎన్‌క్లోజర్‌కు ఇరువైపులా స్టీల్ ఫ్రెమ్‌లు ఏర్పాటు చేశారు.