అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు
Published on: Sun Jul 14, 2024 6:27AM
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలోని బట్లర్ సిటీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ట్రంప్ స్వల్పంగా గాయపడ్డారు.
బుల్లెట్ ఆయన చెవిని తాకుతూ వెళ్లింది. చెవినుంచి రక్తం కారుతుండగా ట్రంప్ పిడికిలి బిగించి నినాదాలు చేశారు. కాగా ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్పుల్లో మరణించాడు.
కాగా ట్రంప్ పై కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ ఖండించారు. అమెరికాలో హింసకు తావులేదని ట్వీట్ చేశారు. కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్ పై కాల్పుల ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని పేర్కొన్నారు. ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


