బ్రేకింగ్ న్యూస్: అసదుద్దీన్ మీద కాల్పులు
Published on: Thu Feb 3, 2022 5:49PM
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మీద కాల్పులు జరిగాయి. ఈ నెల 10న యూపీలో తొలి దఫా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మీరట్ జిల్లా కితౌర్ లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అనంతరం అసదుద్దీన్ కాన్వాయ్ మీద దుండగులు కాల్పులు జరిపారు. ఛిజార్సీ టోల్ గేట్ దగ్గర తన వెహికల్ పై ముగ్గురి నుంచి నలుగురు వ్యక్తులు కాల్పులు జరిపారని, నాలుగు రౌండ్లు కాల్పులు జరిగాయన్నారు. ఈ ఘటనలో కార్ టైర్లు పంచర్ అయ్యాయని, వెహికల్ లో ఉన్న తామందరమూ క్షేమంగానే ఉన్నామని చెప్పారు. కాల్పుల తరువాత దుండగులు తమ వెపన్స్ ను అక్కడే వదిలి పారిపోయారని, ఘటన తరువాత మరో వెహికల్ లో వెళ్లిపోయామని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.


