టెక్సాస్ లో కాల్పులు.. తెలుగమ్మాయి మృతి
Published on: Mon May 8, 2023 11:01AM
అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన తాటికొండ ఐశ్యర్య అనే యువతి మరణించింది.
టెక్సాస్ లోని ఓ మాల్ లో దుండగులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మృతులలో తెలంగాణకు చెందిన ఐశ్వర్య అనే విద్యార్థిని కూడా ఉంది.
రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ తాటికొండ నర్సిరెడ్డి కుమార్తె తాటికొండ ఐశ్వర్య. ఐశ్వర్య మృదేహాన్ని హైదరాబాద్ కు రప్పించేందుకు కుటుంబ సభ్యులతో పాటు అమెరికా తెలుగు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. మూడేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం ఐశ్వర్య టెక్సాస్ వెళ్లారు.


