హస్తినలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి
Published on: Sat Sep 6, 2025 10:16AM

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి.సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటన ఢిల్లీలోని ప్రతాప్ నగర్ లో శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం జరిగింది.
దుండగులు జరిపిన కాల్పుల్లో సుధీర్ అలియాస్ బంటి, రాధే ప్రజాపతి తీవ్రంగా గాయపడ్డారు. వారికి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఢిల్లీలో ని ప్రతాప్ నగర్ లో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


