అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి
Published on: Mon Nov 21, 2022 6:08AM
అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలరాడోలోని ఓ నైట్ క్లబ్ లో దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.
మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటన క్లబ్ క్యూ అనే నైట్ క్లబ్ తో జరగింది.ఘటనకు పాల్పడిన వ్యక్తిని దుండగులు అదుపులోనికి తీసుకున్నారు.
క్లబ్ క్యూలో ట్రాన్స్ జెండర్ డే ఆఫ్ రిమంబరెన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఇందుకు కారణమేమిటన్నది వెంటనే తెలియరాలేదు.


