TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అగ్రరాజ్యంలో జాత్యాహంకార జాడ్యం.. కాల్పుల మోతతో మృత్యుమృదంగం

Published on: Mon May 16, 2022 10:37AM

అగ్రరాజ్యం అమెరికాలో జాత్యాహంకార జాడ్యం కాల్పుల మోతతో మరణ మృదంగం వాయిస్తోంది. ఆదివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పది మంది మరణించిన ఘటన మరువక ముందే.. దేశంలో రెండు ప్రాంతాలలో కాల్పుల మోత మార్మోగింది.

\ఈ ఘటనల్లో ముగ్గరు మరణించగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. హోస్టన్​ సూపర్ మార్కెట్​లో ఐదుగురు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.   నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరొకడు గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు.  

ఇక  కాలిఫోర్నియా చర్చ్​లో జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారు.  మరో ఐదుగురు గాయపడ్డారు. కాగా, ఆదివారం న్యూయార్క్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. దుండుగుడి కాల్పుల్లో పది మంది మృతి చెందారు.

\మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూపర్‌ మార్కెట్‌లోకి సైనికుడి వేషదారణలో తుపాకీతో ప్రవేశించిన 18 ఏళ్ల దుండగుడు.. అక్కడున్న వారిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. జాత్యాహంకారమే ఈ ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు.