Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జ్యోతిషుడి మీద ఫైరింగ్
posted on: Apr 1, 2015 2:34PM

హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ప్రాంతంలో నాగరాజు (55) అనే జ్యోతిషుడి మీద గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. బుధవారం మధ్యాహ్నం తన ఇంట్లో వున్న నాగరాజు మీద ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. పొట్ట మీద రెండు రౌండ్లు, తొడ మీద ఒక రౌండు కాల్పులు జరిపిన అనంతరం ఆ వ్యక్తులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. నాగరాజు జ్యోతిషం చెప్పడంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ వుంటాడు. కొద్ది నెలల క్రితం విజయవాడ సమీపంలో ప్రయాణిస్తున్న కారు మీద దాడి చేసి ఒక జ్యోతిషుడితో సహా ముగ్గురిని హత్య చేసిన కేసులో నాగరాజు కూడా నిందితుడిగా వున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు నాగరాజు మీద ఆ కేసుకు సంబంధించిన వారే ఫైరింగ్ జరిపారా, మరెవరైనా కాల్పులు జరిపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






