TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కమ్ముకొస్తున్న కార్చిచ్చు.. పేలిపోతున్న ల్యాండ్ మైన్లు

Published on: Thu May 19, 2022 6:17AM

కార్చిచ్చు కమ్ముకొస్తోంది. ఎల్ ఓసీ వద్ద అటవీ ప్రాంతంలో సోమవారం అంటుకున్న నిప్పు బడబాలనంగా మారి  భారత భూభాగంలోని మెందార్ సెక్టార్‌లోకి చొచ్చుకు వచ్చింది. దీని  ప్రభావంతో జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో ఉన్న ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయి.  సరిహద్దు ప్రాంతం కావడంతో ఉగ్ర చొరబాట్లను  నియంత్రించేందుకు ఈ ప్రాంతంలో సైనికులు ల్యాండ్‌మైన్లు ఏర్పాటు చేస్తుంటారు.

అయితే, కార్చిచ్చు వల్ల చెలరేగిన మంటలతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ల్యాండ్‌మైన్లు పేలుతున్నాయి. ఇప్పటి వరకూ కార్చిచ్చు వల్ల  ఆరు ల్యాండ్‌మైన్లు పేలినట్లు అధికారులు తెలిపారు. ఈ మంటలను ఆర్పేందుకు ఆర్మీ, ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ల్యాండ్ మైన్లు పేలిపోవడం, కార్చిచ్చు కారణంగా దట్టమైన పొగ అలుముకోవడంతో ఇదే అదునుగా పాక్ సరిహద్దులు దాటి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమౌతున్నది.

గురువారం ఉదయం నాటికి కూడా అటవీ ప్రాంతంలో మంటలు అదుపులోనికి రాలేదని తెలుస్తున్నది. బలంగా వీస్తున్న గాలుల వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు.