ఫలక్ నూమా ఎక్స్ ప్రెస్ లో మంటలు
Published on: Fri Jul 7, 2023 2:09PM
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. హౌరా నుంచి సికింద్రాబాద్ కు వస్తున్న ఈ ఎక్స్ ప్రెస్ బీబీ నగర్ మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య అగ్నిప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలు ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు.
అయితే ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆరు బోగీలకు మంటలు వ్యాపించగా, నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జగరలేదు.
తొలుత బోగీలలో పొగలు రావడంతో ప్రయాణీకులు అప్రమత్తమై చైను లాగి వెంటనే బోగీలు ఖాళీ చేశారు. ఘటనాస్థలానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ చేరుకున్నారు. ప్రమాద కారణాలపై విచారణ జరుపుతామని చెప్పారు. ఇటీవలి కాలంలో రైళ్లలో తరచూ ప్రమాదాలు సంభవిస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.


