TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాణసంచా విధ్వంసం

Published on: Sat Nov 2, 2013 12:50PM

 

దీపావళి దగ్గరపడుతున్న సమయంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగానే బాణసంచా పరిశ్రమల్లో పేలుళ్ళు జరుగుతున్నాయి. ఈ పేలుళ్ళలో ఎంతోమంది కార్మికులు మరణిస్తున్నారు. శుక్రవారం నాడు తమిళనాడులోని కుంభకోణంలో ఒక బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో తొమ్మిది మంది మరణించారు. పదిమందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం నాడు చైనాలోని బీజింగ్‌లో వున్న ఒక బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటు కుంభకోణం, అటు బీజింగ్‌లో జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువమంది మహిళలే వున్నారు.