ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు
Published on: Sat Apr 18, 2026 9:30AM
.webp)
హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో శుక్రవారం (ఏప్రిల్ 17) రాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి నుంచి పాలకొల్లు వెళ్లాల్సిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మా త్తుగా మంటలు చెలరే గాయి. ఈ ఘటన మెట్రో పిల్లర్ నంబర్ 734 సమీపంలో, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జాతీయ రహ దారిపై జరిగింది. జేఎన్టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్న సమయంలో బస్సులో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందో ళనకు గురయ్యారు.
ఘటన జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా దింపేయడంతో ప్రణనష్టం తప్పింది. ప్రయాణికులు తమ లగేజీతో సహ సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
కానీ అప్పటికే బస్సు మంటల్లో దగ్దం అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అతి కష్టం మీద అనంతరం పోలీసులు ట్రాఫిక్ ను క్లీయర్ చేశారు.


