కేసీఆర్ చండీయాగంలో మంటలు
Published on: Sun Dec 27, 2015 2:00PM

నిరాటంకంగా సాగుతున్న అయుత చండీయాగం చివరి రోజున కొంచెం ఆటంకం కలిగింది. యాగశాల ప్రాంగాణంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జనం ఒక్కసారిగా అటు ఇటు గోల చేస్తూ పరుగులు తీశారు. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు గంట పాటు యాగానికి ఆటంకం కలిగినా ఆ తరువాత మళ్లీ ఎప్పటిలా కొనసాగింది.


