TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

Published on: Sun May 17, 2026 3:24PM

 

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూనిట్–3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్లాంట్ ఆవరణంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. పెద్ద ఎత్తున మంటను చిలరేగితో దట్టమైన పొగలు వెదజల్లలతో ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న వెంటనే అధికారులు అనంతరం ఘటన స్థలానికి చేరుకున్నారు. పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఈ ఘటనలో కంట్రోల్ కేబుల్స్, వాల్వులు దెబ్బతిన్నట్లు తెలిసింది. అయితే ప్రధాన యంత్రాలకు ఎలాంటి నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన ప్లాంట్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టి అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. గత ఏడాది యూనిట్–1లో కూడా అగ్నిప్రమాదం జరిగిన విషయం గుర్తుండగానే, కొద్దిరోజుల క్రితమే అనధికారికంగా యూనిట్–3లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారని సమాచారం. వరుస ఘటనల నేపథ్యంలో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు అధికారుల వెల్లడించారు.