ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి
Published on: Thu Dec 24, 2015 10:38AM

సౌదీ అరేబియాలో దారుణం జరిగింది. సౌదీలోని జిజన్ నగరంలోని ఒక ప్రైవేట్ వైద్యశాలలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 మంది మరణించగా, వంద మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆస్పత్రి మొదటి అంతస్తులో వున్న ఐసీయు, మెటర్నిటీ వార్డులో మంటలు చెలరేగి, ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేలోపే ప్రాణనష్టం జరిగిపోయింది. ఈ అగ్ని ప్రమాదానికి దారి తీసిన కారణాలను అన్వేషిస్తున్నారు.


