తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
Published on: Fri Jun 16, 2023 1:05PM
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోవింద రాజస్వామి ఆలయం వద్ద ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపు లో అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున ఎగసి పడుతున్న మంటలు, చుట్టు పక్కల దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తోంది.
తిరుపతి ఫోటో ఫ్రేమ్స్ తయారీ షాపులో మంటలు చెల రేగాయి. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి.ఘటనస్థలికి సమీపంలో గోవిందరాజు స్వామి ఆలయ రథం ఉంది. మాడ వీధిలో రాకపోకలు నిలిపివేసారు. మంటల్లో పలు బైకులు దగ్దమయ్యాయి. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ అగ్నిప్రమాదం సంభవించింది.మంటల్లో నాలుగు అంతస్తుల భవనం కూడా ఉంది. సమీప భవనాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
గోవిందరాజు స్వామి రధం మండపానికి మంటలు వ్యాపించాయి


