తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం
Published on: Thu Jul 3, 2025 10:18AM
.webp)
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఉదయం చెలరేగిన మంటలు ఆలయం ముందున్న చలువ పందిళ్లకు వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పలు దుకాణాలు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఆలయరథానికి ఎటువంటి ముప్పు కలగలేదని, మంటలు వ్యాపించగానే ఆలయ రథాన్ని సురక్షితంగా అక్కడ నుంచి తరలించేశామనీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.


