రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
Published on: Thu Sep 18, 2025 9:21AM
.webp)
తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయ సమీపంలోని పవర్ బ్యాంకులు తయారు చేసే మునోత్ పరిశ్రమలో గురువారం (సెప్టెంబర్ 18) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో పరిశ్రమ అంతా వ్యాపించాయి. మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతి అయింది. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


