కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం
Published on: Tue Sep 2, 2014 12:29PM
కోల్‌కతా మహానగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌లోని 24 అంతస్తులున్న ఛటర్జీ ఇంటర్నేషనల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనంలోని 15వ అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. 15వ అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. నాలుగు ఫైరిజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మంటల కారణంగా 24 అంతస్తుల ఈ భవనం కూలిపోయే అవకాశం కూడా వుందని స్థానికులు భయపడుతున్నారు.


