కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అగ్ని ప్రమాదం
Published on: Thu Jan 29, 2026 8:10AM
.webp)
కర్నూలులోని కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బుధవారం (జనవరి 28) జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని సిల్వర్ సామాగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంక్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో ఫ్యాక్టరీలోని పలు వస్తువులతో పాటు ఓ వాహనం దగ్ధమైంది. స అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.


