TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్షణికావేశంతో ఘోరం

Published on: Fri Apr 10, 2015 4:38PM

 

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గురువారం మధ్యాహ్నం ఘోర అగ్నిప్రమాదంతో జరిగింది. భార్యాభర్తల గొడవ వల్ల ఆ భార్య చనిపోవడమే కాకుండా 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. 30 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అందెం సత్తిబాబు, దేవి దంపతులు శెట్టిబలిజ కాలనీలోని నివసిస్తున్నారు. ఓవిషయమై వీరిద్దరి మద్య గొడవ జరగింది. దీంతో దేవి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో సత్తిబాబు గాయపడ్డాడు. ఓ వైపు ఎండలు, మరోవైపు గాలులు ఎక్కువగా రావడంతో మంటలు వ్యాపించాయి. క్షణాల్లో కాలనీలోవున్న 40 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఫైర్ ఇంజన్ సిబ్బంది రెండు గంటలు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి చినరాజప్ప ఈ ప్రమాదం జరిగినందుకు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో భాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని చినరాజప్ప హామీ ఇచ్చారు. ఇప్పటికే సహాయ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.