చర్చిలో భారీ అగ్నిప్రమాదం.. ఈజిప్టులో 41 మంది మృతి
Published on: Mon Aug 15, 2022 7:54AM
ఈజిప్టులోని ఓ చర్చిలో ఆదివారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. చర్చిలో అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో అక్కడ కనీసం ఐదు వేల మంది ఉన్నారని చెబుతున్నారు.
కాప్టిక్ అబు సిఫిన్ చర్చలో ఆదివారం ప్రార్థనలకు భారీ సంఖ్లో వచ్చారు. కాగా ఆ సమయంలో కరెంట్ పోవడంతో జనరేటర్ వేశారు. ఓవర్ లోడ్ అవ్వడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగాయి.
మంటలు చెలరేగిన సమయంలో చర్చిలో పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో తొక్కిసలాట జరిగింది. మంటలను అదుపు చేశారు. తొక్కిసలాట కారణంగానే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.


