సల్మాన్ పై హైదరాబాద్ లో కేసు

 

 

 

కండలవీరుడు సల్మాన్ ఖాన్ మీద కేసులు కొత్త కాదు. కృష్ణ జింకలను వేటాడడం దగ్గర్నుంచి మనవాడు తరచుగా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. అయితే ఈసారి బాలీవుడ్ బాచిలర్ మీద కేసు వేసింది హైదరాబాద్ వాసులు. బిగ్ బాస్ షోలో ముస్లీం ల మనోభావాలు దెబ్బతీశారంటూ పాతబస్తీకి చెందిన వ్యక్తి చేసిన పిర్యాదు మేరకు ఫలక్ నమా పోలీసులు సల్మాన్ ఖాన్ పై తాజాగా కేసు నమోదు చేశారు. కొసమెరుపు ఏమిటంటే... గత ఏడాది బిగ్ బాస్ లో కామన్ మ్యాన్ గా కాలు మోపిన ఖురేషి హైదరాబాద్ వాసే కావడం,అతనికీ సల్మాన్ తో తీవ్రమైన గొడవాలు రావడం..