TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫైనాన్స్ సంస్థ మోసం...యువకుడు బలి

Published on: Sat Oct 11, 2025 7:15PM

 

మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థ క్యూనేట్ మోసానికి ఓ యువకుడు బలి అయినా ఘటన ఆ కుటుంబంలో విషా దాన్ని నింపింది. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం లో ఉన్న వేలూరు లో నివాసముంటున్న హరికృష్ణ (26) అనే యువకుడు మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థలో నాలుగు లక్షల కడితే ప్రతి నెల 15 వేల రూపాయల వడ్డీ వస్తుం దని నమ్మించారు. ఆ మాటలు నిజమని నమ్మిన హరికృష్ణ అప్పు చేసి మరి నాలుగు లక్షల రూపాయలు క్యూనెట్ కంపెనీకి ఇచ్చాడు. 

ఆ తర్వాత క్యూనెట్ కంపెనీ ఇచ్చిన షాక్ కి హరికృష్ణ మైండ్ బ్లాక్ అయింది. ఇది చైన్ లింక్ కాబట్టి మరో వ్యక్తితో నాలుగు లక్షలు కట్టిస్తేనే 15 రూపా యలు వస్తాయని చెప్పారు. అసలే హరికృష్ణ గతంలో ఆన్లైన్ బెట్టింగ్స్  ఆడి రూ.18 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు తాజాగా మరో నాలుగు లక్షల అప్పుచేసి తీసుకు వచ్చి క్యూనెట్ కంపెనీలో పెట్టాడు. 

ఒకవైపు అప్పుల బాధ.... మరోవైపు క్యూ నెట్  సంస్థ మోసాన్ని భరించ లేక తీవ్ర మనస్థా పానికి గురైన హరికృష్ణ ఆత్మ హత్య చేసుకున్నా డు అయితే హరి కృష్ణ ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాశాడు. క్యూనెట్ కంపెనీ నన్ను మోసం చేసింది. వాళ్లు చెప్పింది ఒకటి అందులో చేసేది మరొకటి... వారి మాటలు నమ్మి నేను అప్పు చేసి మరీ నాలుగు లక్షల కట్టారు. 

డబ్బులు కట్టిన తర్వాత ఆ కంపెనీ నన్ను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ... సూసైడ్ నోట్లో రాసి ఆత్మ హత్య చేసుకు న్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.