TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

"సీతమ్మ వాకిట్లో....." సరికొత్త వివాదం

Published on: Thu Jan 17, 2013 6:19AM

 

రామ్ చరణ్ నటించిన ‘నాయక్’ సినిమాలో విలన్ కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు గండి బాబ్జీ పేరు పెట్టినందుకు వివాదంలో చిక్కుకొంటే, ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా చిన్నపాటి వివాదంలో చిక్కుకొంది.

 

ఆ సినిమాలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో అగ్ని ప్రమాదం సంభవించే సన్నివేశం, కేవలం హీరోల హీరోయిజం ప్రదర్శించడానికి ప్రత్యేకంగా సృష్టించడం చాల తప్పని శ్రీశైలం దేవస్థానం ఈ.వో. శ్రీనివాసరావు అన్నారు. శ్రీరామనవమి రోజున అటువంటి దుర్ఘటనలు ఇంతవరకు ఎన్నడూ జరుగలేదని, స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్బంగా మిగిలిన రోజులకి బిన్నంగా వాతావరణం చాలా ఆహ్లాదంగా మారి అక్కడక్కడ చిన్నపాటి వానలు కూడా పడుతూ ఎటువంటి అగ్నిప్రమాదాలకు తావీయకుండా పంచభూతాలు భక్తులను కాపాడుతాయని అయన అన్నారు. కేవలం హీరోల హీరోయిజం ప్రదర్శనకొరకు ఇటువంటి సన్నివేశాలు సృష్టించడం చాలా అపచారమని, అది హిందువుల, ముఖ్యంగా శ్రీరామ భక్తుల మనోభావాలను దేబ్బతీసేవిదంగా ఉందని ఆరోపిస్తూ, వెంటనే సినిమాలోంచి ఆ సన్నివేశాలను తొలగించాలని ఆయన కోరారు. లేకపోతే, సినిమా తీసినవారిపై కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించేరు.