విజయశాంతిది తెలంగాణ కాదన్నమురళీమోహన్
Published on: Thu Jan 5, 2012 9:39AM
హైద
రాబాద్: ఫిల్మ్‌నగర్ కాలనీలో తెలంగాణవారికి చోటేలేదని విజయశాంతి చేసిన ఆరోపణలను ప్రస్తావించగా ఫిల్మ్‌నగర్ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీమోహన్ ఇలా స్పందించారు.‘టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతి తెలంగాణకు చెందినవారా? ఎవరన్నారు..’ అని ఫిల్మ్‌నగర్ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీమోహన్ ప్రశ్నించారు. సొసైటీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో సొసైటీ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సొసైటీలో ప్లాట్ కేటాయించాలని విజయశాంతి తమను అడగలేదని మురళీమోహన్ స్పష్టం చేశారు. విజయశాంతిది అసలు తెలంగాణ కాదని, తెలంగాణవారికి ప్లాట్లు కేటాయించలేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.


