కోడి రామకృష్ణ కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్

 

ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు నిన్ననే చెప్పారు. ఈరోజు కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచారు. కోడి రామకృష్ణ 1982 లో చిరంజీవి తో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమా చేసి డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. ఆ తరువాత 'అమ్మోరు, అరుంథతి, మంగమ్మగారి మనవడు, రిక్షావోడు, దేవుళ్ళు, దేవి, పెళ్లి, అంకుశం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు.