TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ

Published on: Mon May 6, 2019 11:34AM

 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ పలుచోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పుణ్యమా అని తెలంగాణలో కూడా అటువంటి వారతవరణమే కనిపిస్తోంది. సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జిల్లాలోని గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో పోలింగ్ బూత్‌ వద్ద.. ఓటు వేయడానికి వస్తున్న ఓటర్లని తమకి ఓటేయాలంటే తమకి ఓటేయాలంటూ.. ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు.. పోటాపోటీగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దీంతో మాట మాట పెరిగి టీఆర్ఎస్-కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలను సముదాయించి శాంతిపజేశారు.