TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫిడే ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌

Published on: Mon Jul 28, 2025 4:17PM

 

ఫిడే మహిళల ప్రపంచకప్‌ విజేత‌గా భారత ప్లేయర్  దివ్య దేశ్‌ముఖ్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫైనల్‌ టై బ్రేక్‌ గేమ్‌లో తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపిపై విజయం సాధించి టైటిల్‌ గెలుచుకుంది. ఫైనల్స్‌లో తొలి రెండు గేమ్స్‌ డ్రాగా ముగిశాయి. దీంతో సోమవారం నిర్వహించిన టై బ్రేకర్‌లో దివ్య గెలుపొందింది. దీంతో ఈ ప్రపంచకప్‌లో గెలిచిన తొలి భారత మహిళగా నిలిచారు. 

విజయం సాధించక దివ్య ఎమోషనల్ అయ్యారు. ఈ విజయం ద్వారా దివ్య కేవలం 19 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ హోదాను కూడా సాధించింది. భారత్ నుండి ఈ ఘనత సాధించిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా ఆమె నిలిచింది. ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో మొదటిసారిగా ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్‌లో తలపడటం విశేషం