TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి జోగు రామన్న గృహ నిర్బంధం.. ఎందుకో తెలుసా?

Published on: Fri Jan 16, 2026 8:22AM

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జోగు రామన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో జోగురామన్న అరెస్టు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటనను అడ్డుకుంటామంటూ మాజీ మంత్రి జోగు చేసిన ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం (జనవరి 16) ఉదయమే ఆయనను హైస్ అరెస్టు చేశారు. 

రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం (జనవరి 16) , నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు. వీటితోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆరంభం పలకనున్నారు.  ఈ నేపథ్యంలోనే సీఎం పర్యటనను అడ్డుకుంటామని జోగు రామన్న ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.