ఆత్మాహుతి దాడి: 17మంది మృతి

 

మధ్య ఆఫ్రికాలోని కెమరూన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 17 మంది మరణించారు. కెమరూన్‌కి ఉత్తర దిశగా వున్న దబంగా ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడి మృతుల్లో ఇద్దరు కెమరూన్ సైనికులు కూడా వున్నారని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. మానవ బాంబుగా తనను తాను పేల్చివేసుకున్నది ఒక మహిళ అని తెలుస్తోంది.