ఒకర్ని కాపాడబోయి ఏడుగురు మృతి
Published on: Mon Apr 6, 2015 12:26PM

ఒకర్ని కాపాడబోయి కుటుంబంతో పాటు బంధువులు కూడా మృతి చెందారు. ఈ దారుణమైన ఘటన చైనాలో చోటుచేసుకొంది. చైనాలోని ఓ కుటుంబం తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లింది. అంత్యక్రియల తరువాత శ్మశాసం పక్కన ఉన్న రిజర్వాయర్లో స్నానం చేయడానికి వెళ్లారు. అయితే వారిలో 17 ఏళ్ల యువతి పొరపాటున అక్కడ ఉన్న రిజర్వాయర్లో పడిపోయింది. ఆమెను కాపాడటానికి ప్రయత్నించిన ఆమె కుటుంబంతో పాటు బంధువులు మొత్తం ఏడుగురు మరణించారు. అయితే వారిలో ఎవరికి పెద్దగా ఈత రాదని, అయినా యువతిని కాపాడటానికి ప్రయత్నించారని చైనా పోలీసులు తెలిపారు.


