ఫీ రీ ఎంబర్స్‌మెంట్: గవర్నర్‌జీ మీరే చూడాలి!
Published on: Wed Jul 16, 2014 12:42PM
.jpg)
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రేగిన మొట్టమొదటి వివాదం ఫీ రీ ఎంబర్స్‌మెంట్. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాసినా కేసీఆర్ స్పందించకపోవడంతో వివాదం మరింత ముదిరింది. దాంతో ఈ వివాదం పరిష్కారం బాధ్యత ఇప్పుడు రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భుజస్కందాల మీద పడింది. రెండు రాష్ట్రాలూ ఈ వివాదం విషయంలో గవర్నర్ నిర్ణయాన్నే ఫాలో అవ్వాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి గవర్నర్ నరసింహన్ ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.


