సుప్రీం చేతిలో.. గాంధీజీ హత్యపై కీలక ఆధారాలు

జాతిపిత మహాత్మా గాంధీ హత్య వెనుక గల కారణాలకు సంబంధించిన కీలక ఆధారాలు సుప్రీంకోర్టుకు చేరాయి. ముంబైకి చెందిన అభినవ్ భారత్‌ సంస్థ ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన డా. పంకజ్ ఫడ్నీస్.. అమెరికాలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నుంచి కొన్ని పత్రాలను సేకరించి.. వాటిని సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించారు. మహాత్ముడి హత్యపై పునర్విచారణ కోరుతూ వేసిన పిటిషన్‌లో భాగంగా ఆయన వీటిని దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీ హత్య వెనుక భారీ కుట్ర జరిగినట్లు తెలిపారు. ఈ కీలకమైన పత్రాలను భారత ప్రభుత్వం గతంలో నిషేధం విధించిందని అన్నారు. అనంతరం సుప్రీం స్పందిస్తూ.. పంకజ్ సమర్పించిన ఆధారాలు ఆసక్తికరంగా ఉన్నాయని.. కేసు పునర్విచారణ విషయాన్ని తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది.