TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గచ్చిబౌలి ORR వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి..!

Published on: Tue Jul 28, 2026 7:46PM

 

హైదరాబాద్‌లోని గచ్చి బౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నియో పోలిస్ 1A ఎగ్జిట్ సమీపంలో రోడ్డుపక్కన నిలిపి ఉంచిన లారీని ఓ కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ విషాదం జరిగింది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తి గా నుజ్జునుజ్జు కావడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడి కక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలిం చారు. మృతులను బొమ్మలరామారం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అలాగే లారీ రోడ్డుపై ఎందుకు నిలిపి ఉంచారు? తగిన హెచ్చరిక సూచనలు ఏర్పాటు చేశారా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

Fatal road accident at Gachibowli ORR, Neopolis 1A Exit, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand